ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి...


ఈ పాటను మొదటి సారిగా మా గురువుగారి నోటిద్వారా విన్నాను. నాకు ప్రేరణనివ్వటానికి ఆయన స్వయంగా పాడారు. కాని ఇది ఏ సినిమాలోనిది ఎవరు రాశారు ఆయన నాకు చెప్పలేదు. చాలా కాలం తరువాత నాకు యూట్యూబ్ లో కనిపించింది. ఆపాట విన్న తరువాత నాకు మరో చరణం రాయాలనిపించి మావిద్యార్థులకోసం రాశాను. మొదటి రెండు చరణాలు పట్టుదల సినిమాలోనివి. సీతారామశాస్త్రిగారు రచించారు. తరువాతి చరణం ఆయన యూట్యూబ్ ద్వారా వినిపించారు. నాల్గవ చరణం నేను జతచేశాను. తప్పులుంటే మన్నించండి.
************* ************

"పల్లవి"
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి...
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి...
విశ్రమించవద్దు ఏక్షణం - విస్మరించవద్దు నిర్ణయం...
అప్పుడే నీ జయం నిశ్చయం రా!                                                "ఎప్పుడూ"

"చరణం 1"
నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా...
నీరసించి నిలిచిపోతె నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటె నిత్య ఘర్షణా...
దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకన్న సైన్యముండునా...
ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను దీక్షకన్న సారథెవరురా...
నిరంతరం ప్రయత్నమున్నదా - నిరాశకే నిరాశ పుట్టదా....
నిన్ను మించు శక్తి ఏది నీకు నువ్వు బాసటైతే....                              "ఎప్పుడూ"

"చరణం 2"
నింగి ఎంత గొప్పదైన రివ్వుమన్న గువ్వపిల్ల రెక్కముందు తక్కువేనురా...
సంద్రమెంత పెద్దదైన ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు చిన్నదేనురా...
పిడుగువంటి పిడికిలెత్తి ఉరుమువల్లె హుంకరిస్తె దిక్కులన్ని పిక్కటిల్లురా...
ఆశయాల అశ్వమెక్కి అదుపు లేని కదను తొక్కి అవధులన్ని అధిగ మించరా..
త్రివిక్రమా పరాక్రమించరా... విశాల విశ్వమాక్రమించరా...
జగతి సైన్యమాపలేని జ్వాల వోలె ప్రజ్వలించరా...                               "ఎప్పుడూ"

"చరణం 3"
పశ్చిమాన పొంచివుండి రవిని మ్రింగు అసుర సంధ్య ఒక్కమారు నెగ్గలేదురా...
గుటకపడని అగ్గివుండ సాగరాలనీదుకుంటు తూరుపింట తేలుతుందిరా...
నిశా విలాసమెంతసేపురా... ఉషోదయాన్ని ఎవ్వడాపురా...
రగులుతున్న గుండె కూడ సూర్య గోళమంటిదేనురా...                        "ఎప్పుడూ"

"చరణం 4"
గమ్యమెంత దూరమైన వడివడిగా ముందుకేగు అడుగులకే మోకరిల్లురా...
గ్రంథమెంత పెద్దదైన పుటపుటనూ త్రిప్పిచూడు హారతల్లె కరుగుతుందిరా...
గూగులుంది యూట్యూబుంది ఇంపాక్టూ ఇంటర్నెట్టూ ఇంతకన్న లోకముండునా...
అనుక్షణం అన్వేషించరా... అసాధ్యమేది నీకు లేదురా...
నిన్నమొన్నటి చాయ్ వాలా రాజ్యమేలే నరేంద్రుడురా.....           "ఎప్పుడూ"

సమైక్యాంధ్ర నినాదాలుసమైక్యాంధ్ర నినాదాలు

విభజనపై నిర్ణయం - రాజకీయ కుతంత్రం
తెలుగు నేల దిరా - తెగువ జూపి నడవరా
పొమ్మనుటకు నీవెవ్వడు - పంచేందుకు వాడెవ్వడు
తెలుగు జాతి ఐక్యత - రాష్ట్ర ప్రగతి భావుటా

కలిసుంటే బ్రతుకు తెరువు - విడిపోతే బ్రతుకు బరువు
ఎందుకురా తకరారు - నవ్వుతారు పగవారు
లేనప్పుడు అన్నదమ్ములు - కలిగాక దాయాదులు
నాయాకుల మౌనం - పదవులే ప్రధానం

లేని చరిత్ర సృష్టించకు - కాని విభజన కోరుకోకు
విభజన వాదుల మాట - పతనం వైపుకు బాట
సోనియా కహాని - రాహుల్ ప్రధాని
రాజకీయ ఎత్తుగడలు - సామాన్యుని నెత్తి పగులు

జై సమైక్యాంధ్ర - బుర్ర కథవినరా ఆంధ్రుడ తెలుగు సోదరా విజయము మనదేరా      ... తందాన తాన...
కళ్ళు తెరచి రాష్ట్ర పరిస్థితి ఒక్కసారి కనరా               ... తందాన తాన...    " వినరా"
నీ తాతలు తండ్రులు రాష్ట్రం కోసం త్యాగం చేశారు           ... తందాన తాన...
భాగ్య నగరమూ మన అందరి సొత్తని చాటి చెప్పినారు    ... తందాన తాన...

తెలుగు వారందరూ సమైక్యత తెలిపి ఒక్కటిగ నడిచారు  ... తందాన తాన...
అమరజీవి తన అశువులు బాపగ రాష్ట్రం నిలిపారు       ... తందాన తాన...
విశాలాంధ్రను నేర్పున ఓర్పున సిద్ధ పరిచినారు        ... తందాన తాన...
అఖండమైన తెలుగునేల నీకప్పగించినారు         ... తందాన తాన...

ఇన్ని త్యాగాలు చేసి సాధించిన విశాలాంధ్ర ఫలితం తమ బిడ్డలకైనా దక్కుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, ఎన్నో కలలు కన్నారు.          ......   ఏమిటో కలలు   ........

ఉద్యోగమ్ములు చేయవచ్చని             ... తందాన తందాని తందనా ....
సీమాంధ్ర ప్రజల గొంతు ఎండదని       ... తందాన తందాని తందనా ....
తెలంగాణకు తెగువ హెచ్చునని         ... తందాన తందాని తందనా ....
హైటెక్కు సొబగులు పొందవచ్చునని  ... తందాన తందాని తందనా ....
అంతులేని ఆనందములోన పొంగిపోయినారు    ... తందాన తందాని తందనా ....       "వినరా"

పాపం వెర్రి బాగుల వాళ్ళు, సత్తెకాలపు వాళ్ళు
మన కళ్ళెదురుగా కనిపిస్తూనే ఉందిగా కల.

అరవై ఏళ్ళ పాలన అంతా తెలంగాణ సెగలే          ... తందానా దేవనందనాన ...
అలజడిలోన అభివృద్ధి మాట అటక మీది కెక్కే      ... తందానా దేవనందనాన ...
రాయలసీమ పాలకులంతా హైదరాబాదు బాటే    ... తందానా దేవనందనాన ...
సర్కారు వారి సిరి సంపదలూ రింగు రోడ్డు పాలే    ... తందానా దేవనందనాన ...
అరె.. అన్నదమ్ములని నమ్మినందుకు ఫలితం ఇంతేలే   ... తందానా దేవనందనాన ...

సోనియా తెలంగాణ ప్రకటించింది అది సీమాంధ్రులకు ఇష్టం లేదు
అందుకని కాంగ్రెస్ ను నిందిస్తామా? ఆంధ్ర ప్రజల సుఖం కోసం ఆమె ఎంతో కృషి చేసింది
...... ఏమిటబ్బా ఆకృషి .......

చిరంజీవినీ పట్టిరీ కేంద్రం టూరిజం శాఖ ఇచ్చిరి     "కేంద్రం"
కావూరి సాంబునికీ చక్కని టెక్స్ టైల్సు అప్పగించిరీ      "చక్కని"
పురందేశ్వరి, పళ్లం రాజు HR కాబినెట్ పొందారు    "HR"
కిళ్ళి కృపారానికేమో info tech నేర్పారూ      "info"

పనబాక లక్ష్మికైతే పెట్రోల్, గాసు పట్టించారు    "పెట్రోల్"
జేసుదాసు శీలం కోసం ఫైనాన్సెంతో పెట్టారు.    "ఫైనాన్స్"

....  ఈవిధంగా ఆంధ్ర ప్రదేశ్ ను ఎంతో అభివృద్ధి చేశారంటావ్
మరి వీళ్ళెందుకు విడిపోవాలను కుంటున్నారు?

గుంటనక్కలన్నీ     "తందానా"
సమయమూ చూశాయి    "తందానా"
రాష్ట్ర సంపదనంత  "తందానా"
దోచేయ బూనాయి   "తందానా"

డిల్లీ లోని పెద్దలు   "తందానా"
పంపకాలు చేశారు   "తందానా"
స్వార్థపరులందరితో  "తందానా"
లాలూచి పడ్డారు  "తందానా"

లాలూచి పడ్డారు   "తందానా"
దందాలు దండిగా చేశారూ, బ్లాక్ మెయిల్ బాగుగా నేర్చారు  "2"

కుటుంబాలతో పార్టీ పెట్టి
కూలి పని అంటూ లక్షలు పట్టి
ఉన్నవి లేనివి కల్పించి చెప్పి
విద్యార్థులతో రాలీలు తిప్పి  "2"

మాటలు భాగా చెప్పారు
మనుషుల మోసాల్జేశారు   “మాటలు”

సెటిలర్స్ అంటూ దందా జేసి
సెంటిమెంటును పెద్దగ చూపి
భాష యాసతో మాయలు చేసి
దొంగ దీక్షలతో కాలము బాపి  "2"

చేతులు భాగా చాపారు
ఫాం హౌసులను కొన్నారు  "ఫాం"

చరిత్రలనే మూసి పెట్టి చవటలల్లే చేతులు పట్టి
భాగ్య నగరపు భాగ్యం కోసం తెలుగు తల్లిని అమ్మేరు
ఆమె కంటి నీటిని అమ్మి వారు ఆనందం కొంటారు
పసిపాపల్లాంటి సీమాంద్రుల ఉసురు తగులుతుందని మరిచారు.

ఏం గురూ ఈపాపం ఇట్లా పెరిగి పోవలసిందేనా
మనం గుడ్లప్పగించి చూస్తూ ఊరుకోవలసిందేనా

ఎందరొ శ్రమపడి పెంచిన సంపదరా     "తందానా"
కొందరు పంచుక మింగిన చెల్లదురా      "తందానా"
నీకూ నాకూ లేని హక్కూ      "తందానా"
ఎవ్వడు వాడికి ఇచ్చాడో చెప్పూ     "తందానా"

సంఘ ద్రోహుల ఆటకట్ట వలెరా   "తందానా"
చీడపురుగులను వదల గొట్టవలెరా   "తందానా"

నలుగురితో నువ్వు అడుగు వేయవలెరా   "తందానా"
జాతినంతనూ కూడదీయవలెరా   "తందానా"
అప్పుడు రాష్ట్రం బాగు పడును కదరా  "తందానా"
 శాంతి సౌఖ్యములు పొందగలము లేరా    "తందానా"    "2"